China Covid Cases | స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. కొనసాగుతున్న కొవిడ్ ఉధృతి…!
China Covid Cases | ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కనుమరుగవుతున్న తరుణంలో కొవిడ్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ గత కొన్ని రోజులుగా వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 38,421 కేసులు వెలుగు చూసినట్లు చైనా ఆరోగ్య శాఖ కమిషనర్ వెల్లడించింది. కాగా, సోమవారం 40,347 కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు స్వల్పంగా తగ్గడం ఊరటనిస్తోంది.
China Covid Cases | ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కనుమరుగవుతున్న తరుణంలో కొవిడ్‌కు పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో మాత్రం కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. అక్కడ గత కొన్ని రోజులుగా వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 38,421 కేసులు వెలుగు చూసినట్లు చైనా ఆరోగ్య శాఖ కమిషనర్ వెల్లడించింది. కాగా, సోమవారం 40,347 కేసులు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే కేసులు స్వల్పంగా తగ్గడం ఊరటనిస్తోంది.
తాజాగా నమోదైన కేసుల్లో 3,561 మందికి వైరస్ లక్షణాలు ఉన్నట్లు చైనా ఆరోగ్య శాఖ తెలిపింది. 34,860 మందికి ఎలాంటి లక్షణాలు లేవని పేర్కొంది. వరుసగా రెండో రోజూ ఎలాంటి మరణాలు సంభవించలేదని తెలిపింది. దీంతో మరణాల సంఖ్య 5,233 వద్ద కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఇక చైనాలో 315,248 కొవిడ్ కేసులు రికార్డు అయినట్టు అధికారులు వెల్లడించారు.
కొనసాగుతున్న ఆందోళనలు..
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి చైనా ప్రభుత్వం కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ‘జీరో కొవిడ్’ పాలసీని అమల్లోకి తెచ్చి దేశవ్యాప్తంగా లక్షల మందిని ఇంటికే పరిమితం చేసింది. దీంతో ఆంక్షలకు విసుగెత్తిపోయిన చైనీయులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతున్నారు. జీరో కొవిడ్ విధానానికి వ్యతిరేకంగా ప్రజల చేపడుతున్న ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి. షాంఘై కేంద్రంగా ప్రారంభమైన తాజా ఆందోళనలు.. రాజధాని బీజింగ్‌తోపాటు ఇతర నగరాలకు వ్యాపించాయి. వేలాది మంది వీధుల్లోకి వచ్చి జిన్‌పింగ్ ప్రభుత్వానికి, కొవిడ్ ఆంక్షలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్యక్షుడు జిన్‌పింగ్ వెంటనే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేశారు. తమకు స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కావాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఆందోళనలు యూనివర్సిటీలకు కూడా వ్యాపించాయి. విద్యార్థులు పోస్టర్లు అతికించి నిరసన వ్యక్తం చేశారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

