న్యూఢిల్లీ: తమ దేశాన్ని సందర్శించాలనుకునే భారతీయుల కోసం ఆన్లైన్ వీసా దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టినట్టు చైనా సోమవారం ప్రకటించింది. ఈ విధానం ఈ నెల 20 నుంచి అమలులోకి వచ్చినట్టు తెలిపింది. చైనాను సందర్శించాలనుకునే భారతీయులకు సులభంగా, వేగంగా వీసా ప్రక్రియ పూర్తి అయ్యేందుకు దీన్ని అమల్లోకి తెచ్చినట్టు తెలిపింది.
ఈ కొత్త విధానంలో దరఖాస్తుదారులు తమ దేశ అధికార వెబ్సైట్లో వీసా దరఖాస్తును నింపి, కావాల్సిన డాక్యుమెంట్లను ఆప్లోడ్ చేయాలని భారత్ లోని చైనా ఎంబసీ తెలిపింది. ఆన్లైన్ వేదికతో పాటు న్యూఢిల్లీలోని తమ దేశ వీసా దరఖాస్తు సేవా కేంద్రం కూడా దరఖాస్తుదారులకు ఈ విషయంలో సహాయం చేస్తుందని తెలిపింది.