వింటర్ ఒలింపిక్స్ టార్చ్ రన్లో పాల్గొన్న గాల్వాన్ దాడి కమాండర్..

బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ శుక్రవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ నగరంలో టార్చ్ రిలే జరిగంది. అయితే రెండేళ్ల క్రితం గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో గాయపడ్డ రెజిమెంట్ కమాండర్ టార్చ్ బేయరర్గా రన్లో పాల్గొనేందుకు చైనా అవకాశం ఇచ్చింది. బుధవారం జరిగిన ఒలింపిక్ జ్యోతి ర్యాలీలో సుమారు 1200 మంది టార్చ్బేరర్లు పాల్గొన్నారు. దాంట్లో 2020, జూన్ 15న గాల్వాన్‌లో జరిగిన ఘర్షణలో గాయపడ్డ రెజిమెంట్ కమాండర్ క్యూ ఫాబావో ఉన్నట్లు ఆ దేశానికి చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక తెలిపింది. గాల్వాన్ దాడిలో ఫాబావో తలకు గాయమైంది. స్కేటింగ్ చాంపియన్ వాంగ్ మెంగ్ నుంచి అతను టార్చ్‌ను అందుకున్నట్లు తెలిపారు. గాల్వన్ దాడిలో చనిపోయినట్లు నలుగురు సైనికులను గతంలో చైనా సన్మానించిన విషయం తెలిసిందే. ఒంటర్ ఒలింపిక్స్ ఓపెనింగ్ కార్యక్రమంలో అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అయిదుగురు సెంట్రల్ ఏషియా అధ్యక్షులు, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా పాల్గొననున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కరువు దెబ్బకు కండ్లు తెరిచిన సర్కార్.. పాలమూరు-రంగారెడ్డి పంపులు ఆన్ చేసేందుకు సన్నాహాలు
Badangpet | బడంగ్‌పేట అక్రమాల్లో కొత్త కోణం.. 250 ఫైళ్లపై గ్రూపుగా ఏర్పడిన కాంట్రాక్టర్లు
Singareni Bonus | బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

