వాషింగ్టన్ : చైనా వద్ద 500కుపైగా అణు బాంబులు ఉన్నాయి. కొత్తగా ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్‌ను కూడా అభివృద్ధిపరుస్తున్నది. రానున్న దశాబ్దంలో తన అణు సామర్థ్య దళాలను మరింత వేగంగా ఆధునికీకరించి, విస్తరించబోతున్నది. చైనా గురించి అమెరికన్ కాంగ్రెస్‌కు పెంటగాన్ సమర్పించిన నివేదికలో ఈ వివరాలు ఉన్నాయి.