బీజింగ్: చైనా మాజీ వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల శాఖ మంత్రి టాంగ్ రెన్జియాన్కు కోర్టు ఆదివారం మరణ శిక్ష విధించింది. ఆయన సుమారు రూ.337 కోట్లు అవినీతికి పాల్పడినట్టు రుజువు కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
ఆయన కోర్టుకు సహకరించడంతోపాటు పశ్చాత్తాపం వ్యక్తం చేయడంతో ఈ శిక్ష అమలును రెండేళ్లపాటు నిలిపేసింది. చైనాలోని జిలిన్ ప్రావిన్స్, చాంగ్చున్ ఇంటర్మీడియేట్ పీపుల్స్ కోర్టు ఆదివారం ఈ తీర్పు చెప్పింది.