మెక్సికోలో కాల్పులు.. ఇద్దరు చిన్నారులు సహా 8 మంది మృతి
Mexico | మెక్సికోలో రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన పోరులో ఎనిమిది మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

సిలావో: మెక్సికోలో రెండు డ్రగ్స్ ముఠాల మధ్య జరిగిన పోరులో ఎనిమిది మంది సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. సెంట్రల్ మెక్సికోలోని గ్వానాజువాటో రాష్ట్రంలోని సిలావో మున్సిపాలిటీలో మైటారు సైకిల్పై వచ్చిన ఇద్దరు ఇండ్లపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఏడాది, 16 ఏండ్ల వయస్సు కలిగిన అమ్మాయిలు సహా ఎనిమిది చనిపోయారని అధికారులు తెలిపారు.
మెక్సికోలో అత్యంత హింసాత్మక రాష్ట్రాల్లో గ్వానాజువాటో ఒకటి. ఇక్కడ డ్రగ్ ముఠాలైన శాంటా రోసా డి లిమా, జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్స్ మధ్య తరచూ గన్ ఫైట్ జరుగుతూ ఉంటుంది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. గత నెలలో సిలావోలో జరిగిన దాడుల్లో 11 మంది మరణించారు.
మెక్సికో ప్రభుత్వం మాదకద్రవ్యాల రవాణాకు వ్యతిరేకంగా 2006లో సైనిక చర్యను ప్రారంభించింది. అప్పటినుంచి అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో 3 లక్షలకుపైగా హత్యలు నమోదయ్యాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

