Bone cancer | లండన్, సెప్టెంబర్ 20: ఎముకల క్యాన్సర్(ఆస్టియోసార్కోమా)కు ఇంగ్లండ్‌కు చెందిన పరిశోధకులు కొత్త చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. గాలియం అనే మూలకం ద్వారా క్యాన్సర్ కణాలను 99 శాతం కచ్చితత్వంతో అంతం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ మేరకు ఆస్టన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం జరిపిన ప్రయోగంలో మంచి ఫలితాలు వచ్చాయి. ఎముకలు, దంతాల దృఢత్వాన్ని పెంచే సామర్థ్యం కలిగిన బయోయాక్టీవ్ అద్దాలను పొడిగా మార్చి, దానికి గాలియంను కలిపి చికిత్సకు ఉపయోగించవచ్చని ఈ ప్రయోగానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ రిచర్డ్ మార్టిన్ తెలిపారు.
ఆకలితో ఉండే క్యాన్సర్ కణాలు ఈ మిశ్రమంతో మరణిస్తాయని చెప్పారు.క్యాన్సర్ కారణంగా నష్టం జరిగిన ఎముక మళ్లీ ఏర్పడేందుకు సైతం ఇది ఉపయోగపడుతుందని అన్నారు. ఆస్టియో సార్కోమా బాధితులకు కీమోథెరఫీ, సర్జరీ చేసినప్పటికీ వ్యాధి నుంచి కోలుకునే అవకాశాలు పెరగడం లేదు. దీంతో ఈ కొత్త చికిత్స విధానం ఆశాజనకంగా మారి ంది. త్వరలోనే దీనికి సంబంధించి ట్రయ ల్స్ నిర్వహిస్తామని శాస్త్రవేత్తలు తెలిపారు.