న్యూఢిల్లీ, మార్చి 7: పశ్చిమాసియాలో జరుగుతున్న సైనిక ఘర్షణలను వ్యతిరేకిస్తూ మార్చి 10న దేశవ్యాప్తంగా నిరసన దినం పాటించాలని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త వేదిక, స్వతంత్ర సెక్టోరల్ ఫెరేషన్స్/అసోసియేషన్స్ శనివారం వేర్వేరు ప్రకటనల్లో పిలుపునిచ్చాయి.
ఇటీవల భారత్-అమెరికా చేసుకున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందాలను కూడా ఈ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. నిరసన తెలిపే రోజున పంజాబ్లోని బర్నాలాలో రైతులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఎస్కేఎం తెలిపింది. వ్యవసాయ కార్మికులు, వ్యాపారులు, విద్యార్థులు, మహిళా సంఘాలు సహా వివిధ రంగాలను కలుపుకుని దేశవ్యాప్తంగా ఉమ్మడిగా నిరసనలు తెలియచేయాలని కూడా నిర్ణయించాయి.