ఎవరూ చూడకుండా కారును దొంగలించాడో దొంగ. దాన్ని తీసుకొని పారిపోయే తొందర్లో పప్పులో కాలేశాడు. మెట్రో స్టేషన్లో మెట్లు అడ్డురావడంతో.. సినిమాల్లో చూపించినట్లు కారుతో మెట్లు ఎక్కేద్దాం అనుకున్నాడు. ట్రై చేశాడు కానీ.. అతను అనుకున్నది జరగలేదు. పక్కనే ఉన్న ఎస్కలేటర్, మెట్లపై ఉన్న మరో రెయిలింగ్ మధ్య ఇరుక్కుపోయింది.
దాన్ని బయటకు లాగేందుకు ఫైర్ డిపార్ట్మెంటును పిలవగా.. వాళ్లు ఆ కారును చైన్ల బయటకు లాగారు. ఈ ఘటన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో వెలుగు చూసింది. ఇక్కడి మెట్రో స్టేషన్లో ఇలా కారు ఇరుక్కోపోవడంతో ప్రజలు షాకయ్యారు. కారు దొంగతనం కేసులో ఒక వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇలా కారును బలవంతంగా బయటకు లాగుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.