ఇస్లామాబాద్ : భారతదేశంతో పూర్తి స్థాయి యుద్ధం జరిగే అవకాశాన్ని తోసిపుచ్చలేమని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ మంగళవారం హెచ్చరించారు. ఇరు దేశాల మధ్య ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తమ దేశం పూర్తి అప్రమత్తంగా ఉందని ఆయన తెలిపారు. సమా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ తాము భారత్‌ను నమ్మడం కానీ, విస్మరించడం కానీ చేయమని అన్నారు.
‘నా ఉద్దేశం ప్రకారం భారత్ నుంచి పూర్తి స్థాయి యుద్ధం, ఏదైనా శత్రు వ్యూహం, సరిహద్దు చొరబాట్లు లేదా దాడులు జరిగే అవకాశం లేదని నేను పూర్తిగా తోసిపుచ్చలేను’ అని ఆయన పేర్కొన్నారు.