వాషింగ్టన్, సెప్టెంబర్ 7: ప్రపంచవ్యాప్తంగా 50 ఏండ్లలోపు వారిలో క్యాన్సర్లు అనూహ్యంగా పెరుగుతున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. 1990 నుంచి ఈ పెరుగుదల ప్రారంభమైందని, చిన్న వయసులో సోకే క్యాన్సర్లలో రొమ్ము, పెద్దపేగు, అన్నవాహిక, మూత్రపిండాలు, పాంక్రియాస్, కాలేయ క్యాన్సర్లు ఎక్కువగా ఉంటున్నాయని వెల్లడించింది. మద్యపానం, ధూమపానం, నిద్రలేమి, స్థూలకాయం, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్ వినియోగం తదితర అలవాట్లు చిన్నవయసులోనే క్యాన్సర్లకు దారితీస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు.