క్యాన్సర్ గుట్టు రట్టు!
క్యాన్సర్ గుర్తింపు, చికిత్సలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. క్యాన్సర్‌కు కారణమయ్యే 58 జన్యు సంకేతాలను కొత్తగా గుర్తించారు. పొగతాగడం, అతినీలలోహిత కిరణాలు తదితర కారణాల వల్ల శరీరంలో జరిగే జన్యుమార్పులకు సంబంధించి ఇప్పటివరకు 51 జన్యు సంకేతాలు మాత్రమే శాస్త్రవేత్తలకు తెలుసు
డీఎన్ఏలో 58 కొత్త క్యాన్సర్ కారకాలు
గుర్తించిన ఇంగ్లండ్ శాస్త్రవేత్తల బృందం
క్యాన్సర్ గుర్తింపు, చికిత్సలో ముందడుగు
లండన్, ఏప్రిల్ 24: క్యాన్సర్ గుర్తింపు, చికిత్సలో శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. క్యాన్సర్‌కు కారణమయ్యే 58 జన్యు సంకేతాలను కొత్తగా గుర్తించారు. పొగతాగడం, అతినీలలోహిత కిరణాలు తదితర కారణాల వల్ల శరీరంలో జరిగే జన్యుమార్పులకు సంబంధించి ఇప్పటివరకు 51 జన్యు సంకేతాలు మాత్రమే శాస్త్రవేత్తలకు తెలుసు. అయితే, మనకు తెలియని అత్యంత కీలకమైన క్యాన్సర్ కారకాలు మరెన్నో ఉన్నాయి. తాజా పరిశోధన ఫలితాలతో అవేంటనేది తెలుసుకోవడానికి వీలు కలిగింది.
క్యాన్సర్హ్రిత ప్రపంచం దిశగా..
ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం 12వేల మందికి పైగా క్యాన్సర్ రోగులపై అధ్యయనం చేసింది. వారి క్యాన్సర్ కణితిల్లోని జన్యు మార్పులను విశ్లేషించింది. క్యాన్సర్‌కు కారణమవుతున్న 58 జన్యు సంకేతాలను గుర్తించింది. ఈ వివరాలను ‘సైన్స్ జర్నల్’లో ప్రచురించారు. ఈ సంకేతాల అధారంగా క్యాన్సర్ కారకాలను గుర్తించడంతో పాటు కొత్త చికిత్స విధానాలను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్యాన్సర్ కారక జన్యుమార్పులపై అధ్యయనానికి ఈ ఫలితాలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. క్యాన్సర్ రహిత ప్రపంచసాధనకు తాజా ఫలితాలు కీలకమని చెప్పారు.
క్యాన్సర్ కణితి పెరుగుదలను చెప్పే పరికరం
క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్సా విధానాలు వచ్చాయి. రోగులు బతికే అవకాశాలు పెరిగాయి. అయితే, కొంత మందిలో చికిత్స తర్వాత కూడా మళ్లీ క్యాన్సర్ కణితిలు పెరిగే ప్రమాదం ఉంది. చికిత్స అనంతరం తిరిగి కణితులు ఏర్పడే అవకాశాలను అత్యంత కచ్చితంగా అంచనా వేసేలా ఇంగ్లండ్ శాస్త్రవేత్తలు, వైద్యులు ఆక్టపస్-ఏఐ అనే పరికరాన్ని తయారు చేశారు. ఇది కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తుంది. క్యాన్సర్ రోగులపై నిఘాకు, క్యాన్సర్ మరణాలను తగ్గించేందుకు, సకాలంలో చికిత్స అందించేందుకు ఈ పరికరం చాలా దోహదపడుతుందని వైద్యులు భావిస్తున్నారు.

స్థూలకాయంతో గర్భాశయ క్యాన్సర్!
ఎక్కువ కాలం స్థూలకాయంతో బాధపడే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెండింతలు ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ శాస్త్రవేత్తలు.. ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ, పోలాండ్, స్వీడన్, యూకే, అమెరికాలోని దాదాపు 1,20,000 మంది స్థూలకాయులను పరీక్షించగా, అందులో 13 వేల మంది గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. హార్మోన్ల స్థాయిల్లో తేడాలు వచ్చి ఈ సమస్య వస్తున్నదని, దీన్నిబట్టి స్థూలకాయానికి, క్యాన్సర్‌కు సంబంధం ఉన్నట్టు కనుగొన్నట్టు పరిశోధకులు వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Cancer
- cause
- England
- Researchers
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

