30 రోజులు.. భారత్ విమానాలపై కెనడా నిషేదం
కెనడా| భారత్‌లో కరోనా కేసులు ఉధృతంగా నమోదవుతుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. భారతదేశం నుంచి వచ్చే విమానాలపై నిషేదం విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కెనడా కూడా చేరింది.

ఒట్టావా: భారత్‌లో కరోనా కేసులు ఉధృతంగా నమోదవుతుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. భారతదేశం నుంచి వచ్చే విమానాలపై నిషేదం విధిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో కెనడా కూడా చేరింది. ఇండియా నుంచి వచ్చే ప్యాసింజర్, కమర్షియల్ విమానాలను 30 రోజులపాటు నిషేదిస్తున్నట్లు రవాణాశాఖ మంత్రి ఒమర్ అల్ఘబ్రా ప్రకటించారు. భారత్ నుంచి కెనడాకు వస్తున్న విమాన ప్రయాణికుల్లో ఎక్కువగా కరోనా కేసులను గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఇండియాతోపాటు పాకిస్థాన్‌కు ఇది వర్తిస్తుందని తెలిపారు. అయితే కార్గో విమానాలు, వ్యాక్సిన్ల వంటి అత్యవసర సరుకులను రవాణా చేసే విమానాలు యధావిధిగా నడుస్తాయని చెప్పారు.
గత రెండు వారల్లో కెనడాలోని టొరంటో లేదా వాన్‌కోవర్‌కు ఢిల్లీ నుంచి 18, లాహోర్ నుంచి రెండు విమానాలు వచ్చాయని, వారిలో ఒక్కో విమానంలో కనీసం ఒక్క ప్రయాణికుడైనా అనారోగ్యం ఉన్నారని ఆదేశ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, కెనడాకు వచ్చే ప్రయాణికులకు 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరని ఇప్పటికే ప్రభుత్వం ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశంలో ప్రస్తుతం మూడో విడుత కరోనా విజృంభన నడుస్తున్నది. దేశంలో నిన్న 9 వేల కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 11,51,276కు చేరింది. ఇందులో 23,812 మంది మరణించారు. గతంలో బ్రిటన్ విమానాలపై కూడా ఇలాగే బ్యాన్చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కరోనా దవాఖానలో చెలరేగిన మంటలు.. 13 మంది దుర్మరణం
గుజరాతీయులే ప్రజలా..తెలంగాణ వాళ్లు కాదా!
గర్భధారణకు సమయం కాదు
నేటితో ముగియనున్న సీజేఐ జస్టిస్ బోబ్డే పదవీకాలం
మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్
ఆడబిడ్డ పుట్టిందని అంతులేని సంబురం.. హెలిక్యాప్టర్‌లో ఘన స్వాగతం..!
దేశంలో కరోనా విలయం.. కొత్తగా 3.32 లక్షల కేసులు
హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కన్నుమూత
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

