మంగళవారం 26 జనవరి 2021
International - Dec 23, 2020 , 21:51:21

మోడర్నా వ్యాక్సిన్‌ను కెనడా ఆమోదం

మోడర్నా వ్యాక్సిన్‌ను కెనడా ఆమోదం

ఒట్టావా : మోడర్నా సంస్థ తయారుచేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను కెనడా బుధవారం ఆమోదించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. డిసెంబర్‌ చివరినాటికి 1,68,000 మోతాదుల పంపిణీకి మార్గం సుగమం చేసింది. ఈ నెల ప్రారంభంలో కెనడా ఫైజర్ వ్యాక్సిన్‌కు గ్రీన్ లైట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారులు, ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులకు ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఇవ్వడం ప్రారంభించారు. 

గత శుక్రవారం మోడర్నా వ్యాక్సిన్‌ను అమెరికా ఆమోదించింది. జర్మన్ భాగస్వామి బయోఎంటెక్‌తో ఫైజర్ అభివృద్ధి చేసిన షాట్ యొక్క అల్ట్రా-కోల్డ్ ఉష్ణోగ్రతలు మోడర్నాకు అవసరం లేదు. సాక్ష్యాలను క్షుణ్ణంగా, స్వతంత్రంగా పరిశీలించిన తరువాత మోడర్నా వ్యాక్సిన్‌తో భద్రత, సమర్థత, నాణ్యత అవసరాలను తీరుస్తుందని నిర్ధారించాం" అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ముగిసేలోపు 1,68,000 మోతాదుల మోడర్నా వ్యాక్సిన్‌ను స్వీకరించడానికి కెనడా ఒప్పందం కుదుర్చుకున్నదని ప్రధాని జస్టిన్ ట్రూడో గత వారం తెలిపారు.

కొవిడ్ -19 సెకండ్ వేవ్‌ కెనడా అంతటా తిరుగుతున్నది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని వైద్య అధికారులు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నదని అధికారులు చెప్తున్నారు. కెనడాలో మొత్తం 5,21,509 కేసులు నమోదవగా.. 14,425 మరణాలు సంభవించాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo