శనివారం 23 జనవరి 2021
International - Nov 26, 2020 , 15:09:21

ఈ ఏడాది శాంటా వ‌స్తాడా.. ప్ర‌ధానికి 8 ఏళ్ల బుడ‌త‌డి లేఖ‌

ఈ ఏడాది శాంటా వ‌స్తాడా.. ప్ర‌ధానికి 8 ఏళ్ల బుడ‌త‌డి లేఖ‌

లండ‌న్‌: క‌్రిస్మ‌స్ వ‌స్తుందంటే చాలు చిన్న పిల్ల‌ల్లో ఎక్క‌డ‌లేని ఉత్సాహం క‌నిపిస్తుంది. శాంటా వ‌స్తాడు.. గిఫ్ట్‌లు తెస్తాడ‌ని వాళ్లు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఈసారి క‌రోనా మ‌హ‌మ్మారి ఉంది క‌దా.. అస‌లు శాంటా వ‌స్తాడా అన్న డౌట్ ఓ 8 ఏళ్ల బుడ‌త‌డికి వ‌చ్చింది. వెంట‌నే ప్ర‌ధానికే లేఖ రాశాడు. ఈ లేఖ‌ను లైట్ తీసుకోకుండా ఆ ప్ర‌ధాని కూడా స‌మాధానం ఇచ్చాడు. ఆ బుడ‌త‌డి పేరు మాంటీ కాగా.. అత‌నికి రిప్లై ఇచ్చిన ప్ర‌ధాని పేరు బోరిస్ జాన్సన్‌. ఈయ‌న యూకే ప్ర‌ధాన‌మంత్రి. ఈసారి శాంటా వచ్చే అంశాన్ని ప్ర‌భుత్వం ప‌రిశీలించిందా అంటూ సీరియ‌స్‌గా లేఖ రాశాడు మాంటీ. మీరు చాలా బిజీ అని నాకు తెలుసు. కానీ మీరు, సైంటిస్టులు ఈ అంశంపై కాస్త స్పందిస్తారా అని ఆ లేఖ‌లో మాంటీ అడిగాడు. నేను నార్త్ పోల్‌కు కాల్ చేశాను. ఫాద‌ర్ క్రిస్మ‌స్ బ‌హుమ‌తుల‌తో సిద్ధంగా ఉన్నాడు. క‌చ్చితంగా వ‌స్తాడు. అత‌నితోపాటు రుడాల్ఫ్‌, అన్ని రెయిన్‌డీర్‌లు కూడా అని మాంటీ ఆ లేఖ‌లో చెప్పాడు. ఆ లేఖ‌ను త‌న ట్విట‌ర్‌లో పోస్ట్ చేస్తూ.. బోరిస్ జాన్స‌న్ లేఖ‌కు స‌మాధాన‌మిచ్చారు. త‌న‌కు ఇలాంటి లేఖ‌లు చాలా వ‌స్తున్నాయ‌ని, అధికారుల‌తో కూడా మాట్లాడిన‌ట్లు చెప్పారు. ఈసారి క‌చ్చితంగా ఫాద‌ర్ క్రిస్మ‌స్ బ‌హుమ‌తుల‌ను ఇస్తాడ‌ని హామీ ఇచ్చారు. తాను చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్‌తోనూ మాట్లాడాన‌ని, ఫాద‌ర్ క్రిస్మ‌స్ జాగ్ర‌త్త‌గా, త్వ‌ర‌గా త‌న ప‌ని పూర్తి చేసి వెళ్లిపోతే నీ ఆరోగ్యానికి, ఆయన ఆరోగ్యానికి కూడా ఎలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని మాంటీకి జాన్స‌న్ స‌మాధాన‌మిచ్చారు.  


logo