‘పులి చనువిచ్చింది కదా అని ఆడుకోవాలని చూస్తే వేటాడేస్తది’ అని అదో సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ పులికే కాదు, ఏ జంతువుకైనా సరిపోతుంది. తాజాగా ఒక ఎద్దు ఈ డైలాగ్‌ను నిజం చేసి చూపించింది. జంతు ప్రేమికుడిగా పేరున్న బ్రిటిష్ కమెడియన్ రిక్కీ గెర్వాయిస్ ఒక వీడియో షేర్ చేశారు. దానిలో ఒక ఎద్దు రోడ్డుపై నిలబడి ఉంది.
ఒక వ్యక్తి దాని వద్దకొచ్చి, అవతల ఉన్న జనాలతో ఏదో అంటూ ఎద్దు కొమ్ముల మధ్యలో టచ్ చేశాడు. అంతే, ఆ ఎద్దు ఒక్క ఉదుటున అతన్ని కొమ్ములతో కుమ్మేసింది. అతను కింద పడగానే మొఖంపై ఒక్క తన్ను తన్నింది. ఆ వెంటనే అక్కడి నుంచి ఎద్దు పారిపోయింది.
దెబ్బ గట్టిగా తగలడంతో సదరు యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ‘హాని కలిగించడానికి ప్రయత్నిస్తుండగా ఎవరికైనా హాని జరిగితే.. సింపతీ రాదు’ అని కొందరు అంటున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందీ ఇంకా తెలియరాలేదు.
Boom! pic.twitter.com/bNDaHsfwow
— Ricky Gervais (@rickygervais) August 28, 2022