Watch: రష్యాలోని ఎత్తైన భవనాలపై డ్రోన్ దాడులు.. వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లపై దాడిని తలపించిన దృశ్యాలు
Drone Attack | ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లు రష్యాలోని ఎత్తైన భవనాలను ఢీకొట్టి పేలాయి. 2001లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లను విమానాలు ఢీకొన్న సంఘటనను ఈ దాడి తలపించింది. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లు రష్యాలోని ఎత్తైన భవనాలను ఢీకొట్టి పేలాయి. (Drone Attack) 2001లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లను విమానాలు ఢీకొన్న సంఘటనను ఈ దాడి తలపించింది. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శనివారం ఉదయం రష్యాలోని కజాన్ నగరంపై డ్రోన్లతో ఉక్రెయిన్ దాడి చేసింది. రెండు ఎత్తైన భవనాలను రెండు డ్రోన్లు ఢీకొని పేలిపోయాయి. మంటలు చెలరేగడంతో నల్లటి పొగలు దట్టంగా వ్యాపించాయి.
కాగా, ఎత్తైన ఆయా భవనాల్లోని నివాసితులను సురక్షితంగా ఖాళీ చేయించినట్లు రష్యా మీడియా తెలిపింది. అయితే ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని పేర్కొంది. ఈ సంఘటన నేపథ్యంలో కజాన్ విమానాశ్రయంలో విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించింది.
మరోవైపు 2001 సెప్టెంబర్ 11న అమెరికాలోని న్యూయార్క్‌లో వరల్డ్ ట్రేడ్ సెంటర్లోని ట్విన్ టవర్లపై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడులు చేశారు. హైజాక్ చేసిన విమానాలతో ఎత్తైన టవర్ బిల్డింగ్‌లను ఢీకొట్టారు. దీంతో దట్టంగా మంటలు, పొగలు వ్యాపించాయి. అయితే డిసెంబర్ 21న రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి 9/11 ఉగ్రదాడిని తలపించింది. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
The moment when drones hit high-rise buildings in Kazan after the deployment of the russian electronic surveillance system.
The russians started the war – hence – no pity for the orcs. pic.twitter.com/JbXLTbFslm— Jürgen Nauditt 🇩🇪🇺🇦 (@jurgen_nauditt) December 21, 2024
#Ukraine launches drone attack on residential buildings in Kazan, causing fire#BREAKİNG pic.twitter.com/w3l7qxQXhJ
— APA News Agency (@APA_English) December 21, 2024
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

