Rishi Sunak | సీట్ బెల్ట్ ధరించని రిషి సునాక్.. రూ.10వేల ఫైన్.. ఇలా రెండోసారి..! భారత్‌లో ప్రధాని కారుకూ చలాన్!!
Rishi Sunak | కారులో ప్రయాణిస్తున్నప్పుడు సీట్ బెల్ట్ ధరించనందుకు బ్రిటన్ ప్రధాని రిషి రిషి సునాక్‌కు రూ.10వేల జరిమానా విధించారు పోలీసులు.
Rishi Sunak | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు రూ.10 వేల ఫైన్ వేశారు లంకాషైర్ పోలీసులు. ఈ మేరకు ప్రధానికి శుక్రవారం 100 పౌండ్ల చలాన్ జారీ చేశారు. రెండు రోజుల క్రితం గురువారం జరిగిన ఘటనపై రిషి సునాక్ క్షమాపణ కూడా చెప్పారు. రిషి సునాక్ ప్రభుత్వంలో ఉండగా ఫైన్ విధించడం ఇది రెండోసారి. 2020 జూన్‌లో కరోనా లాక్డౌన్ ఆంక్షలు ఉల్లంఘించి.. నాటి ప్రధాని బోరిస్ జాన్సన్ దంపతులతో కలిసి బర్త్‌డే పార్టీకి హాజరైనందుకు రిషి సునాక్‌కు కూడా ఫైన్ విధించారు పోలీసులు.
బ్రిటన్‌లో సీట్ బెల్ట్ ధరించకుంటే రూ.10 వేల జరిమానా
బ్రిటన్‌లో కారులో ప్రయాణించే ప్రయాణికులు సీట్ బెల్ట్ ధరించకుంటే రూ.10వేల జరిమానా విధిస్తారు. ఈ అంశం కోర్టుకు వెళితే.. సదరు ప్రయాణికుడిపై రూ.50 వేల వరకు ఫైన్ విధించే అవకాశం ఉంది. అయితే, రిషి సునాక్ కారులో వెనుక సీట్లో కూర్చున్నారు. డ్రైవింగ్ చేయడం లేదు. కానీ కారు నడుస్తున్న వేళ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారాయన. దీని ఆధారంగా బ్రిటన్ పోలీసులు చర్య తీసుకున్నారు.
ప్రధాని ఫైన్ చెల్లిస్తారన్న డౌనింగ్ స్ట్రీట్
ఈ అంశం వెలుగు చూడటంతో 10-డౌనింగ్ స్ట్రీట్‌లోని ప్రధానమంత్రి కార్యాలయం రియాక్టయింది. తన పొరపాటును ప్రధాని రిషి సునాక్ పూర్తిగా అంగీకరిస్తున్నారని, జరిగిన పొరపాటుకు క్షమాపణ చెబుతున్నారని తెలిపింది. ఫైన్ చెల్లించేందుకు సిద్ధం అని పేర్కొంది. ఇదిలా ఉంటే లంకాషైర్ పోలీసులు ట్విట్టర్లో ఈ సమాచారం వెల్లడించినా ప్రధాని రిషి సునాక్ పేరు బయట పెట్టలేదు. 42 ఏండ్ల లండన్ వ్యక్తిపై ఫైన్ వేశామని పేర్కొన్నారు.. కారు నడుస్తుండగా సీట్ బెల్ట్ పెట్టుకోనందుకు ఫైన్ వేసినట్లు తెలిపారు.

భారత్‌లో ఇలా..
భారత్‌లోనూ గతంలో ప్రధానమంత్రి కారుపై చలాన్ విధించారు. ఈ ఘటన 1982లో చోటు చేసుకున్నది. నాడు తొలి మహిళా ఐపీఎస్ అధికారిగా కిరణ్ బేడీ.. ఢిల్లీలో ట్రాఫిక్ డీసీపీగా పని చేస్తున్నారు. అప్పట్లో ఏషియన్ గేమ్స్ జరుగనున్నాయి. ప్రధానిగా ఇందిరాగాంధీ కారు.. కన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్‌కు సమీపాన మింటో బ్రిడ్జి ఏరియాకు వచ్చింది. అక్కడే ట్రాఫిక్ రూల్స్‌కు భిన్నంగా కారు పార్క్ చేశారు. ఆ కారు తొలగించాలని కిరణ్‌బేడీ సిబ్బంది అడిగినా సదరు డ్రైవర్ అంగీకరించకపోవడంతో క్రేన్ సాయంతో తీసేశారు. కారుపై చలాన్ కూడా వేశారు. ఆ తర్వాతే కిరణ్ బేడీ.. వీఐపీ సెక్యూరిటీ ఇన్చార్జిగా ట్రాన్స్ఫర్ అయ్యారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

