లండన్: బ్రిటీష్ సాహసికుడొకరు స్కీ-బేస్ జంపింగ్‌లో కొత్త రికార్డును నెలకొల్పాడు. 34 ఏండ్ల జాషువా బ్రెగ్మెన్ 18,753 అడుగుల ఎత్తు నుంచి ప్యారాచూట్ సహాయంతో దూకి సురక్షితంగా హిమాలయాలపై దిగి గిన్నిస్ రికార్డు సాధించాడు. అంతకుముందు ఫ్రెంచ్ వ్యక్తి 2019లో సాధించిన 14,301 అడుగుల రికార్డును జాషువా అధిగమించాడు.
స్కీయింగ్, బేస్ జంపింగ్ క్రీడల సమ్మిళితమే ఈ స్కీ-బేస్ జంపింగ్. రెండు పొడవైన ప్లాస్టిక్ కర్రలను రెండు బూట్లకు బిగించి మంచులో వేగంగా కదలడమే స్కీయింగ్. ఎత్తయిన ప్రదేశాల నుంచి ప్యారాచూట్ సహాయంతో కిందకు దూకడాన్ని బేస్ జంపింగ్గా పేర్కొంటారు.