బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 ఆరోగ్యంపై… వైద్యులు ఆందోళన
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య పర్యవేక్షణలో ఆమె ఉండాలని సిఫార్సు చేశారు. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం ఆమె స్కాట్లాండ్లోని బాల్మోరల్ కోటలో క్షేమంగానే ఉన్నారని తెలిపింది. అయితే క్వీన్ ఎలిజబెత్ అనారోగ్యం విషయం తెలిసిన వెంటనే వారసత్వంగా పీఠాన్ని అధిష్ఠించనున్న 73 ఏళ్ల ప్రిన్స్ చార్లెస్, 40 ఏళ్ల ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియమ్ హుటాహుటిన స్కాట్లాండ్కు బయలుదేరారు.
కాగా, 96 ఏళ్ల క్వీన్ ఎలిజబెత్ 2, గత ఏడాది అక్టోబర్ నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నడవడం, నిల్చోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అయితే రాజకీయ సలహాదారులతో బుధవారం జరుగాల్సిన సమావేశానికి క్వీన్ ఎలిజబెత్ దూరంగా ఉన్నారు.
మరోవైపు క్వీన్ ఎలిజబెత్ ఆరోగ్యంపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేసిన సమాచారం తెలిసిన వెంటనే బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్, ఆమె మంత్రుల బృందం పార్లమెంట్‌లోని చాంబర్ నుంచి వెళ్లిపోయారు. అనంతరం ప్రధాని లిజ్ ట్రస్ ఒక ట్వీట్ చేశారు. ‘ఈ మధ్యాహ్నం భోజన సమయంలో బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి అందిన సమాచారంతో దేశం మొత్తం తీవ్ర ఆందోళన చెందుతోంది’ అని పేర్కొన్నారు.
The whole country will be deeply concerned by the news from Buckingham Palace this lunchtime.
My thoughts – and the thoughts of people across our United Kingdom – are with Her Majesty The Queen and her family at this time.
— Liz Truss (@trussliz) September 8, 2022
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

