Viral News | బొమ్మ కారు (Toy Car) కొనేందుకు ఇద్దరు అన్నదమ్ములు ఏకంగా అసలు కారు నడుపుకుంటూ వెళ్లారు. ఈ ఘటన మలేషియా (Malaysia)లోని లంకావీ ద్వీపం (Langkawi Island)లో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆరేండ్ల అన్న, మూడేండ్ల తమ్ముడు ఇద్దరూ కలిసి బొమ్మ కారు కొనేందుకు టాయ్స్ షాప్ (Toys Shop)కు వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో ఇంట్లో తల్లిదండ్రులు నిద్రపోతున్న సమయంలో వారికి తెలియకుండా ఇంట్లో ఉన్న అసలు కారును తీసుకెళ్లారు. పెద్ద పిల్లాడు కారును డ్రైవ్ చేయగా.. చిన్నోడు పక్క సీటులో కూర్చున్నాడు. కారు ఉలు మెలక నుంచి కంపుంగ్ నైయోర్ చబాంగ్ ప్రాంతం వైపు ప్రయాణిస్తోంది. సుమారు 2.5 కిలోమీటర్ల దూరం వెళ్లిన తర్వాత కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ల్యాంప్ స్తంభాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు బానెట్ పూర్తిగా ధ్వంసమైనట్లు లంకావీ పోలీసులు చీఫ్ (Langkawi police chief) షారిమన్ (Shariman) వెల్లడించారు.
కాగా, మద్యం మత్తులో డ్రైవర్ కారు నడిపి ప్రమాదానికి గురైనట్లు ముందుగా అంతా భావించారు. స్థానికులు ఘటనాస్థలికి వెళ్లి చూడగా అందులో ఇద్దరు చిన్నారులు కనిపించారు. వారిని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. బొమ్మకారు కొనేందుకు టాయ్స్ షాప్‌కు వెళ్తున్నట్లు ఆ చిన్నారులు తెలిపారు. ‘అమ్మ ఇంట్లో ఉంది. మేము బొమ్మల దుకాణానికి వెళ్తున్నాము’ అంటూ పెద్ద పిల్లాడు చెప్పగా.. ‘మేము నల్లటి కారు కొనాలనుకుంటున్నాము’ అంటూ చిన్నోడు స్థానికులకు సమాధానమిచ్చాడు. ఈ ప్రమాదంలో పెద్ద పిల్లాడికి చిన్న చిన్న గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. చిన్న పిల్లాడు మాత్రం సురక్షితంగా ఉన్నట్లు వివరించారు. అయితే, ఆ ఇద్దరు చిన్నారుల పేర్లను మాత్రం వారు వెల్లడించలేదు.
Also Read..
Imran Khan | జైల్లోనే ఇమ్రాన్ హత్యకు కుట్ర.. గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చారు : న్యాయవాదులు
Wedding Dress | 50 వేల క్రిస్టల్స్‌తో ప్రత్యేకంగా వెడ్డింగ్ గౌన్.. వరల్డ్ రికార్డ్