Imran Khan | జైల్లోనే ఇమ్రాన్ హత్యకు కుట్ర.. గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చారు : న్యాయవాదులు
Imran Khan | పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను జైల్లోనే హత్య చేసేందుకు కుట్రలు జరిగాయని ఆయన తరఫు న్యాయవాదులు ఆరోపించారు.
Imran Khan | అవినీతి కేసులో నాటకీయ పరిణామాల మధ్య పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని, పీటీఐ (PTI) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మంగళవారం అరెస్టైన విషయం తెలిసిందే. ఇమ్రాన్ అరెస్ట్‌తో ఆ దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఈ కేసులో ఇమ్రాన్‌కు సుప్రీం కోర్టు (Supreme Court ) లో ఊరట లభించింది. ఆయన అరెస్టు అక్రమమని పాక్ అత్యున్నత న్యాయస్థానం తేల్చింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ను ఆయన తరఫు న్యాయవాదులు కలిశారు. గంటకు పైగా ఆయనతో మాట్లాడారు. అనంతరం మీడియాతో వారు మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ను జైల్లోనే హత్య చేసేందుకు కుట్రలు జరిగాయని ఆరోపించారు.
తనను జైల్లో నిద్ర పోనివ్వట్లేదని ఇమ్రాన్ చెప్పినట్లు న్యాయవాదులు తెలిపారు. జైల్లో ఇమ్రాన్‌ను చిత్ర హింసలు గురి చేస్తున్నట్లు చెప్పారు. టాయిలెట్, బెడ్‌లేని ఒక గదిలో మాజీ ప్రధానిని ఉంచినట్లు పేర్కొన్నారు. వాష్‌రూమ్ వాడుకోవడానికి కూడా అనుమతించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైల్లోనే ఇమ్రాన్‌ను హత్య చేసేందుకు కుట్ర చేసినట్లు ఆరోపించారు. ఆయనకు నెమ్మదిగా గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్లు, ఆహారం ఇచ్చినట్లు చెప్పారు. ఛాతీలో నొప్పిగా ఉందని ఇమ్రాన్ చెప్పినట్లు వారు వివరించారు. ఇక ఇస్లామాబాద్‌లోని పోలీస్ లైన్స్‌కు తీసుకొచ్చిన తర్వాత ఇమ్రాన్‌కు ఆహారం కూడా ఇవ్వడం లేదని న్యాయవాదులు వెల్లడించారు.
అవినీతి నిరోధక సంస్థ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూర్ (NAB) కస్టడీలో ఉన్న ఇమ్రాన్‌ను తక్షణమే విడుదల చేయాలని పాక్ సుప్రీంకోర్టు ఆదేశించింది. పీటీఐ చైర్మన్‌ను అరెస్టును సవాల్ చేస్తూ ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా షాబాజ్ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్రాన్‌ను అరెస్టు చేసిన తీరును తప్పుబట్టింది. మాజీ ప్రధాని అరెస్టు చట్టవిరుద్ధమన్న కోర్టు.. పాక్‌ను జైలుగా మార్చాడన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది.
Also Read..
Caste Discrimination | కుల వివక్ష బిల్లుకు కాలిఫోర్నియా సెనేట్ ఆమోదం
CBSE Class 12 Result | సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
Wedding Dress | 50 వేల క్రిస్టల్స్‌తో ప్రత్యేకంగా వెడ్డింగ్ గౌన్.. వరల్డ్ రికార్డ్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

