Caste Discrimination | కుల వివక్ష బిల్లుకు కాలిఫోర్నియా సెనేట్ ఆమోదం
Caste Discrimination | అమెరికాలోని (US) కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ (California Senate) చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. సెనేట్‌లో ప్రవేశపెట్టిన కులవివక్ష (Caste Discrimination) నిరోధక బిల్లుకు గురువారం ఆమోదం తెలిపింది.
Caste Discrimination | అమెరికాలోని (US) కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ (California Senate) చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. సెనేట్‌లో ప్రవేశపెట్టిన కులవివక్ష (Caste Discrimination) నిరోధక బిల్లుకు గురువారం ఆమోదం తెలిపింది. సెనేట్‌లో మొత్తం 40 మంది సభ్యులు ఉండగా.. ఈ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్‌లో 35 మంది పాల్గొన్నారు. అందులో బిల్లుకు అనుకూలంగా 34 మంది ఓటు వేయగా.. ఒకరు మాత్రమే దానికి వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. దీంతో బిల్లు పాస్ అయినట్లు సభాపతి ప్రకటించారు. త్వరలో ఈ బిల్లును హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌కు పంపిస్తామని, అక్కడ పాస్ అయ్యాక గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తామని తెలిపారు. గవర్నర్ సంతకం చేశాక ఈ ఎస్బీ 403 బిల్లు చట్టంగా మారుతుందని వివరించారు.
కాలిఫోర్నియా రాష్ట్రంలో కుల వివక్ష (Caste Discrimination) కొనసాగుతోందని.. దానిని రూపు మాపాలని డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు, సెనేటర్ (California Senator) ఐషా వాహబ్ (Aisha Wahab) ఎస్బీ403 (SB 403 ) బిల్లును రూపొందించి ఈ ఏడాది ఏప్రిల్‌లో సెనేట్‌లో ప్రవేశపెట్టారు. కులం కారణంగా వివక్ష చూపడం, హింసకు పాల్పడటం చట్ట విరుద్ధంగా మార్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో అన్నిచోట్లా అందరికీ సమాన అవకాశాలు, సదుపాయాలు, సేవలు అందాలని ఐషా వాహబ్ అన్నారు. ఇందులో భాగంగా వివక్షను ఎదుర్కొంటున్న వారికి రక్షణ కల్పించేందుకు అవసరమైన విధివిధానాలతో ఎస్బీ 403 బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సెనేట్ ఆమోదం పొందడంపై ఐషా సంతోషం వ్యక్తం చేశారు.
సెనేట్ ఆమోదంతో ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలకు నిలయమైన కాలిఫోర్నియా కులం ఆధారంగా వివక్షను నిషేధించిన మొదటి అమెరికా రాష్ట్రంగా అవతరించింది. కాగా, ఇటీవల సీటెల్ కుల ఆధారిత వివక్షను నిషేధించిన మొదటి నగరంగా నలిచిన సంగతి తెలిపిందే.
Also Read..
Rolex Watch: 60 ఏళ్ల క్రితం నాటి రోలెక్స్ వాచీ.. వేలంలో 41 లక్షలకు అమ్ముడుపోయింది
Twitter | ట్విట్టర్‌కు కొత్త సీఈఓ.. ఆరు వారాల్లో బాధ్యతలు చేపట్టనున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్
California | కాలిఫోర్నియాలో 5.5 తీవ్రతతో భూకంపం
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

