కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో (California) భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 5.5 తీవ్రతతో భూమి కంపించిందని (Earthquake) యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. కాలిఫోర్నియాలోని ఈస్ట్ షోర్కు 4 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
కాగా, గురువారం జపాన్ (Japan) రాజధాని టోక్యో (Tokyo), దాని పరిసర ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. 5.4 తీవ్రతతో భూమి కంపించిందని, దీనివల్ల పలువురు గాయపడ్డారని జపాన్ మెటలర్జికల్ ఏజెన్సీ తెలిపింది. చిపా ప్రిఫెక్చర్లో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది.
United States | An earthquake of magnitude 5.5 occurred 4 km southwest of East Shore in California. The depth of the earthquake was 1.5 km: USGS
(Photo: USGS) pic.twitter.com/NhxyC5CKkM
— ANI (@ANI) May 12, 2023