ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగి (Governament Contract Officer) ఆస్తులు చూసి అధికారులు షాక్ అయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ (Madhya Pradesh Police Housing Corporation) లో కాంట్రాక్టు ఇన్‌ఛార్జి అసిస్టెంట్ ఇంజినీర్ (contractual in-charge assistant engineer) గా పనిచేస్తున్న హేమ మీనా (Hema Meena) ఇంట్లో లోకాయుక్త (Lokayukta) అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో మీనా ఆస్తుల చిట్టా చూసి అధికారులు ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆమె ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు.
భోపాల్ (Bhopal)లోని హేమా మీనా నివాసంలో లోకాయుక్త (Lokayukta) గురువారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రూ.7 కోట్ల విలువైన ఆస్తులు బయటపడ్డాయి. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే.. ఆమె నెల జీతం కేవలం రూ.30 వేలు మాత్రమే. అయినప్పటికీ ఇంత మొత్తంలో ఆస్తులు కూడబెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె జీతంతో పోలిస్తే ఆస్తుల విలువ 232 శాతం ఎక్కువ.
7 లగ్జరీ కార్లు, విలువైన గిర్ జాతికి చెందిన రెండు డజన్ల పశువులతోపాటు రూ.30 లక్షల విలువ చేసే 98 ఇంచెస్ అత్యాధునిక టీవీని అధికారులు గుర్తించారు. హేమా తన తండ్రి పేరుమీద 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థలం కొనుగోలు చేసి అందులో రూ.కోటి వెచ్చించి విలాసవంతమైన ఇంటిని నిర్మించినట్లు గుర్తించారు. వీటితోపాటు ఇతర ప్రాంతాల్లో స్థలాలు కూడా కొనుగోలు చేసినట్లు తేల్చారు. ఆమె నివాస ప్రాంగణంలో 100 కుక్కలు, పూర్తి వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్, మొబైల్ జామర్లు, ఇతర విలువైన వస్తువులను కూడా అధికారుల సోదాల్లో బయటపడ్డాయి.
Hema Meena 2
అంతేకాకుండా సుమారు 20 వాహనాలు హేమా మీనా కొనుగోలు చేసినట్లు అధికారులు తమ విచారణలో గుర్తించారు. అందులో ట్రాక్టర్లు, వరి నాట్లు యంత్రాలు, హార్వెస్టర్లు, అనేక వ్యవసాయ పరికరాలు ఉన్నాయి. ప్రస్తుతం మూడు ప్రాంతాల్లో లోకాయుక్త అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ దాడుల్లో మరిన్ని అక్రమ ఆస్తుల చిట్టా బయటపడే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు హేమపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Hema Meena 3
Also Read..
Imran Khan | జైల్లోనే ఇమ్రాన్ హత్యకు కుట్ర.. గుండెపోటు వచ్చేలా ఇంజెక్షన్లు ఇచ్చారు : న్యాయవాదులు
Wedding Dress | 50 వేల క్రిస్టల్స్‌తో ప్రత్యేకంగా వెడ్డింగ్ గౌన్.. వరల్డ్ రికార్డ్
Caste Discrimination | కుల వివక్ష బిల్లుకు కాలిఫోర్నియా సెనేట్ ఆమోదం