కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో పాటు సమీప ప్రాంతాల్లో ఉన్న మార్చురీల్లో వేల సంఖ్యలో మృతదేహాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. రష్యా దళాలు ఆ ప్రాంతం నుంచి విరమించిన తర్వాత సుమారు 1020 మంది పౌరుల మృతదేహాలను మార్చురీల్లో ఉన్నట్లు అధికారులు చెప్పారు. కీవ్‌కు సమీపంలో ఉన్న బోర్డియాంకా పట్టణంలో పదుల సంఖ్యలో ఉన్న మృతదేహాలను గుర్తించారు. ఆ మృతదేహాలపై చిత్రహింస పెట్టినట్లు గుర్తులు ఉన్నాయి. తెలియకుండానే రష్యా సాధారణ పౌరుల్ని మతమార్చిందని కీవ్ అధికారి ఆండ్రీ నెబటివ్ తెలిపారు. కీవ్ పట్టణానికి సమీపంలో ఉన్న సమాధుల్లో పిల్లల శవాలు కూడా వెళ్తున్నాయి. అయితే తమ ఆపరేషన్‌లో పౌరుల్ని టార్గెట్ చేయలేదని రష్యా చెబుతోంది. బుచ్చా పట్టణంలో కూడా సుమారు 500 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు.