Boat sink : యెమెన్ తీరంలో సోమాలియా, ఇథియోపియా నుంచి వచ్చిన వలసదారుల పడవ మునిగిపోయింది. ప్రమాదంలో 49 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 140 మంది గల్లంతయ్యారు. ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
సోమాలియా, ఇథియోపియాలకు చెందిన 260 మందితో ఇటీవల ఉత్తర సోమాలియా తీరం నుంచి బయలుదేరిన పడవ సోమవారం యెమెన్ దక్షిణ తీరంలో మునిగిపోయింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితికి చెందిన అంతర్జాతీయ వలసల సంస్థ మంగళవారం వెల్లడించింది.
పడవమునిగిన సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న యెమెన్ రెస్క్యూ టీమ్స్ 71 మందిని రక్షించాయి. 49 మృతదేహాలను వెలికితీశాయి. మరో 140 మంది గల్లంతయ్యారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు, 31 మంది మహిళలు ఉన్నారు.