Congo Boat Capsizes : మధ్య ఆఫ్రికాలోని కాంగోలో పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. అక్కడి ఈక్వెటర్ ప్రావిన్స్‌లోని ఒక నదలో జరిగిన ఈ దుర్ఘటనలో దాదాపు 86 మంది మరణించారు. సెప్టెంబర్ 10 బుధవారం బసన్కుసు పరిధిలో పడవ మునిగిపోయిందని శుక్రవారం స్థానిక మీడియా వెల్లడించింది. ఈ పడవ ప్రమాదం తెలిసి యావత్ కాంగో ఉలిక్కిపడింది.
రాత్రిపూట ప్రయాణించడం, పడవ సామర్థ్యానికి మించి జనాలు ఉండడంతోనే ప్రమాదం జరిగినట్టు సమాచారం. విషయం తెలిసిన వెంటనే కాంగో నేవీ, తీర ప్రాంత రక్షక దళం సహాయక చర్యలు చేపట్టింద. అయితే.. ఈ యాక్సిడెంట్లో కన్నుమూసిన వాళ్లలో విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
JUST IN: At least 86 people have died after a motorized boat capsized in northwestern Congo’s Equateur Province. | @AP pic.twitter.com/07C4ZlfBbP
— The Philippine Star (@PhilippineStar) September 12, 2025