కాలిఫోర్నియా: ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం కనుగొనేందుకు పరిశోధనలు సాగుతున్నాయి. బ్యాక్టీరియా నుంచి ఎకోఫ్రెండ్లీ ప్లాస్టిక్ (పీడీకే)ను సృష్టించారని సైన్స్ జర్నల్ ‘నేచర్ సస్టెయినబులిటీ’ తాజాగా వెల్లడించింది. బ్యాక్టీరియా నుంచి బయో ప్లాస్టిక్, పునరుత్పాదక ప్లాస్టిక్‌ను తయారుచేయటంలో అమెరికాలోని ‘బెర్కెలీ నేషనల్ ల్యాబొరేటరీ’ (బెర్కలీ ల్యాబ్) శాస్త్రవేత్తలు విజయవంతం అయ్యారని పేర్కొన్నది. కంప్యూటర్ కేబుల్స్, జిగురు, బిల్డింగ్ మెటీరియల్స్.. మొదలైన వాటిని పీడీకే ప్లాస్టిక్ నుంచి తయారుచేస్తారు. ఈ తరహా ప్లాస్టిక్(పీడీకే)ను బ్యాక్టీరియా నుంచి రూపొందించవచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.