ఇజ్రాయిల్: రష్యాకు చెందిన బిలియనీర్ లియోనిడ్ నెవ్జ్లిన్ ఆ దేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ఇజ్రాయిల్లో ఉంటున్న బిలియనీర్ నెవ్జ్లిన్ తన ఫేస్బుక్లో ఈ విషయాన్ని ప్రకటించారు. మరో దేశ చిన్నారులను చంపుతున్న దేశంలో పౌరుడిగా ఉండలేనని తన పోస్టులో తెలిపారు. పుతిన్ ఏది ముట్టుకున్నా అది మసవుతుందన్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పాలనా తీరును నెవ్జ్లిన్ చాన్నాళ్ల నుంచి వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం నెవ్జ్లిన్ పరారీలో ఉన్నారు. ఇజ్రాయిల్లో తలదాచుకున్న లియోనిడ్కు ఆయిల్ బిజినెస్ ఉంది. గతంలో మైఖేల్ కోడోకోవిస్కీతో కలిసి ఆయన పనిచేశారు. యుకోస్ ఇంధన సంస్థలో సభ్యుడి ఉన్నారు. ఓ మర్డర్ కేసులో దోషిగా తేలిన బిలియనీర్ నెవ్జ్లిన్ .. రష్యా నుంచి దూరంగా ఉంటున్నారు. రష్యా జివిష్ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా చేశారు. యూద ఏజెన్సీలకు చెందిన వివిధ శాఖలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయిల్ పత్రిక హారెట్జ్లో ఆయనకు 25 శాతం వాటా ఉన్నది. నెవ్జ్లిన్ కూతురు ఇరినా ఓ రాజకీయ ప్రముఖుడిని పెళ్లి చేసుకున్నది.