Joe Biden | చైనా ఈవీ కార్లకు జో బైడెన్ షాక్.. 100 శాతం దిగుమతి సుంకం పెంపు..!
Joe Biden | చైనా విద్యుత్ కార్ల దిగుమతికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెక్ పెట్టారు. చైనా నుంచి దిగుమతయ్యే విద్యుత్ కార్లపై దిగుమతి సుంకం 25 నుంచి 100 శాతానికి పెరుగుతుంది.
Joe Biden | త్వరలో దేశాధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైనా నుంచి దిగుమతి అయ్యే వివిధ వస్తువులపై సుంకాలు గణనీయంగా పెంచుతున్నట్లు తెలిపారు. దీంతో చైనా నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం 25 శాతం నుంచి 100 శాతానికి పెరుగుతుంది. ఎలక్ట్రిక్ కార్లు, ఇతర వాహనాల్లో వాడే బ్యాటరీలు, బ్యాటరీ విడి భాగాలపై విధించే దిగుమతి సుంకం 7.5 నుంచి 25 శాతానికి పెరుగుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది నాటికి సెమీ కండక్టర్లపై పన్ను రేటు 25 నుంచి 50 శాతానికి, లిథియం అయాన్ ఈవీ బ్యాటరీపై 7.5 నుంచి 25 శాతానికి పెరుగుతుంది.
జో బైడెన్ తీసుకున్న నిర్ణయం ఈ ఏడాది నుంచి మూడేండ్ల పాటు అమలులో ఉంటుంది. దీనివల్ల చైనా నుంచి 18 బిలియన్ డాలర్ల దిగుమతులపై ప్రభావం చూపుతుంది. అమెరికన్ ఉత్పత్తుల వాడకం పెంచడానికి జో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
Chiranjeevi | మూవీ లవర్స్కు గుడ్ న్యూస్.. వైజాగ్లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

