జంతువులకు సిక్త్ సెన్స్ పనిచేస్తుందని కొందరు చెబుతుంటారు. చాలా జంతువులు తెలివైనవే అని నమ్ముతుంటారు. ఇక కోతులు, ఎలుగుబంట్లు మనిషుల్లా ప్రవర్తిస్తుంటాయి. ఓ ఎలుగుబంటి పడిపోయిన ట్రాఫిక్ కోన్ కనిపించగానే సరిచేసి వెళ్లిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.
ఈ వీడియోను ‘బిటింగెబిడెన్’ అనే యూజర్ ట్విటర్లో షేర్ చేశారు. ఓ ఎలుగుబంటి దారెంట నడుచుకుంటూ వెళ్తున్నది. పక్కన ట్రాఫిక్ కోన్ పడిపోయి కనిపించగానే, అక్కడే ఆగిపోయింది. దాని దగ్గరికెళ్లి నోటితో దాన్ని సరిచేసింది. ఈ వీడియోను అమెరికాలోని అలస్కాలోగల డెనాలి నేషనల్ పార్క్ సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
This is just a bear.. being a good citizen.. pic.twitter.com/WupQmIfuX4
— Buitengebieden (@buitengebieden) June 11, 2022