BBC Chairman | ప్రముఖ బ్రిటన్ మీడియా సంస్థ బీబీసీ (BBC) చైర్మన్ రిచర్డ్ షార్ప్ (Richard Sharp) తన పదవి నుంచి వైదొలిగారు. రెండేండ్ల క్రితం అంటే.. 2021లో నాటి బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ (Boris Johnson) రుణం తీసుకున్నారు. జాన్సన్‌కి లోన్ ఇప్పించడంలో రిచర్డ్ షార్ప్ తన ప్రమేయాన్ని వెల్లడించలేదని ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఒక స్వతంత్ర సంస్థ దర్యాప్తు జరిపింది. బోరిస్ జాన్సన్‌కు లోన్ ఇప్పించడంలో తన ప్రమేయం ఉందని వెల్లడించక పోవడం ద్వారా రిచర్డ్ షార్ప్ ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించారని ఆ దర్యాప్తులో తేలింది. దీంతో రిచర్డ్ షార్ప్.. బీబీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నట్లు శుక్రవారం తెలిపారు. .
బీబీసీ చైర్మన్ పోస్ట్ కోసం అప్లయ్ చేయకముందే తాను ఆ పోస్ట్ విషయమై ఆసక్తిగా ఉన్నట్లు నాటి ప్రధాని బోరిస్ జాన్సన్‌కు రిచర్డ్ షార్ప్ చెప్పారని ఆరోపణలు. బోరిస్ జాన్సన్‌కు లోన్ ఇప్పించడంలో రిచర్డ్ షార్ప్ సాయమందించారు. బీబీసీ చైర్మన్ నియామక సమయంలో ఈ సంగతిని షార్ప్ వెల్లడించలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై నిజానిజాలు నిగ్గు తేల్చడానికి ప్రభుత్వ నియామకాల కమిషనర్ ఆదేశాలతో స్వతంత్ర దర్యాప్తు జరిగింది. ఈ దర్యాప్తులో రిచర్డ్ షార్ప్ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. దీంతో బీబీసీ చైర్మన్‌గా వైదొలిగినా.. సంస్థ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు షార్ప్ తెలిపారు. తదుపరి చైర్మన్ నియామకం జరిగే వరకూ ఈ పదవిలో కొనసాగుతానని చెప్పారు.
బ్యాంకింగ్ రంగంలో సుదీర్ఘ అనుభవం గల రిచర్డ్ షార్ప్.. 2021లో బీబీసీ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ సంస్థ ‘గోల్డ్ మాన్ శాక్స్`లో ప్రస్తుత బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు రిచర్డ్ షార్ప్ పై అధికారికగా ఉన్నారు. కానీ, బోరిస్ జాన్సన్‌తో రిచర్డ్ షార్ప్ రుణ వివాదానికి రిషి సునాక్ దూరంగా ఉన్నారు. తాను ప్రధానిగా బాధ్యతలు చేపట్టక ముందే బీబీసీ చైర్మన్‌గా రిషి సునాక్ నియమితులయ్యారని ఇటీవల వెల్లడించారు.