BBC: ట్రంప్‌కు క్షమాపణలు చెప్పిన బీబీసీ
BBC: డోనాల్ట్ ట్రంప్‌కు బీబీసీ క్షమాపణలు చెప్పింది. ట్రంప్ ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేసి ప్రసారం చేసినట్లు బీబీసీపై ఆరోపణలు ఉన్నాయి. సారీ చెప్పకుంటే పరువునష్టం కేసు దాఖలు చేస్తామని ట్రంప్ లాయర్ హెచ్చరించడంతో.. బీసీసీ వార్తాసంస్థ వెనక్కి తగ్గింది.
లండన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్‌కు .. ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ(BBC) క్షమాపణలు చెప్పింది. ట్రంప్ ప్రసంగాన్ని తప్పుగా ఎడిట్ చేసి ప్రసారం చేసినట్లు బీబీసీపై ఆరోపణలు ఉన్నాయి. 2021 జనవరి 6వ తేదీన ఆయన చేసిన ప్రసంగాన్ని బీసీసీ ఛానల్లో ప్రసారం చేయడం వల్లే క్యాపిటల్ హిల్‌లో అల్లర్లు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి కొన్ని రోజుల క్రితం బీసీసీలో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు ఉన్నత వ్యక్తులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తమ ప్రోగ్రామ్‌తో ట్రంప్ పేరుప్రఖ్యాతలకు నష్టం కలిగేలా ప్రవర్తించలేదని బీసీసీ వెల్లడించింది. ట్రంప్ దాఖలు చేసిన బిలియన్ డాలర్ల నష్టపరిహారం కేసును బీబీసీ తోసిపుచ్చింది.
ఈ నేపథ్యంలో బీసీసీ చైర్మెన్ సమిర్ షా .. వైట్‌హౌజ్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. ట్రంప్ ప్రసంగాన్ని ఎడిట్ చేసిన అంశంలో తనతో పాటు సంస్థ క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్నారు. తాము ప్రసారం చేసిన ఆ వివాదాస్పద డాక్యుమెంటరీని మళ్లీ ప్రసారం చేసే ప్రణాళిక లేదని బీసీసీ వెల్లడించింది. తాము ఎడిట్ చేసిన ట్రంప్ ప్రసంగం తప్పుదోవ పట్టించే రీతిలో ఉన్నట్లు అంగీకరిస్తున్నామని బీసీసీ చెప్పింది.
క్షమాపణలు చెప్పాలని ట్రంప్ లాయర్ ఇటీవల బీబీసీకి లేఖ రాశారు. లేదంటే బిలియన్ డాలర్ల నష్టపరిహారం కేసు నమోదు చేయనున్నట్లు హెచ్చరించారు. దీంతో బీబీసీ సంస్థ వెనక్కి తగ్గింది. పనోరమా కరెంట్ అఫైర్స్ సిరీస్‌లో బీసీసీ ట్రంప్ ప్రసంగాన్ని ప్రసారం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

