Nepal floods | నేపాల్లో కొట్టుకొచ్చిన బ్యాంకు లాకర్.. నగదు ఎత్తుకెళ్లిన స్థానికులు.. రూ.58 లక్షలు స్వాధీనం
Nepal floods : నేపాల్లో ఒక బ్యాంకుకు చెందిన లాకర్ కొట్టుకురాగా.. అందులోంచి భారీగా నగదును స్తానికులు దోచుకున్నారు. అయితే, వారి నుంచి తర్వాత పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు.
Nepal floods : నేపాల్లో ఆకస్మిక వరదల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వందలాది మంది గల్లంతయ్యారు. ఇలాంటి సమయంలో మానవత్వంతో, బాధ్యతతో వ్యవహరించాల్సిన నేపాల్ ప్రజలు కొందరు తమ స్వార్ధాన్ని బయటపెడుతున్నారు. తాజాగా ఒక నిర్లక్ష్యపు ఘటన వెలుగు చూసింది. నేపాల్లో ఒక బ్యాంకుకు చెందిన లాకర్ కొట్టుకురాగా.. అందులోంచి భారీగా నగదును స్తానికులు దోచుకున్నారు.
అయితే, వారి నుంచి తర్వాత పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపాల్లోని దాడింగ్ జిల్లా, గల్చి రూరల్ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. రుసువాలో వరద సంభవించిన సంగతి తెలిసిందే. ఈ వరదల్లో ఒక బ్యాంకుకు సంబంధించిన లాకర్ కూడా కొట్టుకుపోయింది. ఈ లాకర్ త్రిశూలి నది వద్దకు చేరింది. దీంతో స్థానికులు ఈ లాకర్ బయటకు తీశారు. అందులోని 92,68,505 నేపాలీ రూపాయలు (రూ.58 లక్షల భారత కరెన్సీ)ని స్థానికులు దోచుకున్నారు. ఈ ఘటన బయటకు రావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ లాకర్ నుంచి నగదు కొట్టేసిన 29 మంది నిందితుల్ని అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈ ఘటనలో ఎవరైనా ఉన్నారా.. ఇంకా నగదు మిగిలి ఉందా అనే ఘటనలపై విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు నేపాల్ వరదల్లో 600 మందికిపైగా మరణించగా, 2,500 మంది గల్లంతయ్యారు. వీరిలో 537 మంది వరకు విదేశీయులున్నారు. ఇందులో 320 మంది భారతీయులు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

