Bangladesh | పొరుగు దేశం బంగ్లాదేశ్ (Bangladesh)లో రాజకీయ సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం దేశం విడిచి వెళ్లిపోయారు. దీంతో బంగ్లాదేశ్‌ను సైన్యం తమ చేతుల్లోకి తీసుకుంది. త్వరలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్మీ చీఫ్ వాకర్-ఉజ్-జమాన్ సోమవారం ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా సైన్యం ముందడుగు వేసింది. ఇందులో భాగంగానే ప్రస్తుత పార్లమెంట్‌ను బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాహబుద్దీన్ (Mohammed Shahabuddin) రద్దు చేశారు (Dissolves Parliament). దేశంలోని రాజకీయ నేతలు, త్రివిధ దళాధిపతులు, పౌర సంఘాలతో చర్చల అనంతరం ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అధ్యక్షుడి నిర్ణయంతో త్వరలోనే దేశంలో సైన్యం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
కాగా, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్‌లో రాజకీయ అస్థిరత ఏర్పడింది. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్లో బంగ్లా మీదుగా ఢాకాలోని ప్యాలెస్‌ను వీడి భారత్ చేరుకున్నారు. అనంతరం రంగంలోకి దిగిన ఆర్మీ దేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం దేశం మొత్తం ఆర్మీ చేతుల్లోకి వెళ్లిపోయింది. అయినప్పటికి హింస, అల్లర్లు ఆగడం లేదు. ఇప్పటి వరకూ ఈ అల్లర్లలో 300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
Also Read..
Sheikh Hasina | మరికొన్ని రోజులు భారత్‌లోనే షేక్ హసీనా.. ఎందుకంటే..?