ఢాకా: సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువకులు సాహసాలు చేస్తున్నారు. ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి తరహా సంఘటన వెలుగులోకి వచ్చింది. రైలు పట్టాల వద్ద రీల్ చేసేందుకు కొందరు యువకులు ప్రయత్నించారు. అయితే వేగంగా వచ్చిన రైలు ఒక యువకుడ్ని ఢీకొట్టింది. (Bangladeshi Teen Hit By Speeding Train) ఈ భయానక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఈ సంఘటన జరిగింది. షింగిమారి రైల్వే బ్రిడ్జి వద్ద టిక్‌టాక్ వీడియో రికార్డ్ చేసేందుకు కొందరు అబ్బాయిలు ప్రయత్నించారు. రైలు రావడాన్ని గమనించి పట్టాల వద్ద చాలా దగ్గరగా వారు ఉన్నారు. ఇంతలో వేగంగా వచ్చిన రైలు ఒక యువకుడ్ని ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తు తీవ్రంగా గాయపడిన ఆ అబ్బాయి ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.
కాగా, ఒక యువకుడి మొబైల్ ఫోన్లో రికార్డైన ఈ భయానక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. యువకుల నిర్లక్ష్యంపై కొందరు మండిపడ్డారు. ఇలాంటివి చేయవద్దని మరికొందరు సూచించారు. రీల్స్ కోసం ఇలా ఎందుకు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారో అర్థం కావడం లేదని ఒకరు ప్రశ్నించారు. సెల్ఫీలు, రిల్స్ కంటే ప్రాణాలు ఎంతో విలువైనవని మరొకరు పేర్కొన్నారు.
While Making Tiktok Videos A Train Hits the guy in Bangladesh
https://t.co/06kZEovLGn— Ghar Ke Kalesh (@gharkekalesh) October 27, 2024