కోల్‌కతా : బెంగాల్‌లోని మాల్దా జిల్లా సరిహద్దులో బంగ్లాదేశ్ చొరబాటుదారులను, స్మగ్లర్లను భారత సైనికులు మన భూ భాగంలోకి రాకుండా అడ్డుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత నవాడ ఔట్‌పోస్ట్ సమీపంలో చొరబాటుకు యత్నిస్తున్న సాయుధులైన 20 మంది కదలికలను బీఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు. కొందరు అప్పటికే కంచెను దాటుకుని భారత భూభాగంలోకి వచ్చినట్టు గమనించారు. సైనికుల కళ్లు గప్పేందుకు చొరబాటుదారులు ఎక్కువ కాంతి గల ఫ్లాష్‌లైట్‌ను ఉపయోగించారు. చొరబాటుదారులను చెదరగొట్టేందుకు సైనికులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.