Sheikh Hasina | ముందు మీ భార్యల చీరలు తగలబెట్టండి.. వారికి బంగ్లాదేశ్ ప్రధాని కౌంటర్
బాయ్‌కాట్ ఇండియా నిరసనకారులకు హసీనా కౌంటర్ ఢాకా, ఏప్రిల్ 1: దేశంలో భారత వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ను తర్వాత వ్యతిరేకించవచ్చు కానీ, తొలుత మీ భార్యలు కట్టుకున్న భారత చీరలను తగలబెట్టాలని సూచించారు.
- బాయ్‌కాట్ ఇండియా నిరసనకారులకు హసీనా కౌంటర్
Sheikh Hasina | ఢాకా, ఏప్రిల్ 1: దేశంలో భారత వ్యతిరేక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్న ప్రతిపక్ష పార్టీ నేతలపై బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌ను తర్వాత వ్యతిరేకించవచ్చు కానీ, తొలుత మీ భార్యలు కట్టుకున్న భారత చీరలను తగలబెట్టాలని సూచించారు.
జనవరిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా వరుసగా నాలుగోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) ‘బాయ్‌కాట్ ఇండియా’ ఉద్యమాన్ని లేవనెత్తింది. హసీనా భారత అనుకూల వాది అని, ఆమె గెలుపులో భారత్ హస్తముందని ఆరోపించింది. బంగ్లాదేశ్ ప్రజలకు ఎన్నడూ మద్దతివ్వని భారత్..
అవామీ లీగ్ (హసీనా పార్టీ)కి మాత్రం మద్దతు ఇస్తోందని, ప్రజల ఆగ్రహానికి ఇదే కారణమని బీఎన్పీ నాయకుడు రాహుల్ కబీర్ రిజ్వీ ఆరోపించారు. భారత్‌పై ప్రతిపక్షాల రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రధాని హసీనా తిప్పికొట్టారు. బీఎన్పీ నేతలు నిజంగా భారత ఉత్పత్తులను బహిష్కరించాలనుకుంటే తొలుత వారి భార్యలు కట్టుకొనే భారత చీరలను తగలబెట్టాలని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

