Muhammad Yunus | అవినీతి కేసులో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ (Muhammad Yunus)కు ఊరట లభించింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గ్రాప్ట్ ఏజెన్సీ దరఖాస్తును ఢాకాలోని ప్రత్యేక న్యాయస్థాన న్యాయమూర్తి రబీ ఉల్ ఆలం ఆమోదించారు.
ఇక కార్మికచట్టాల ఉల్లంఘనకు సంబంధించిన మరో కేసులోనూ యూనస్ సహా మరో ముగ్గురు గ్రామీణ టెలికం సంస్థ అధికారులను ఢాకాలోని లేబర్ అప్పీలేట్ ట్రిబ్యునల్ నిర్దోషులుగా ప్రకటించించి. కార్మిక చట్టాన్ని ఉల్లంఘించారంటూ వీరికి అవినీతి నిరోధక కమిషన్ ఈ ఏడాది జనవరిలో ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 30,000 టాకాలు జరిమానా విధించిన విషయం తెలిసిందే.
కాగా, రాజకీయ అస్థిర పరిస్థితుల మధ్య మూడు రోజుల క్రితం బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్‌గా (Bangladesh interim govts chief adviser) నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ప్రధాని పదవితో సమానమని అధికారులు ప్రకటించారు. అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రభుత్వ వ్యవహారాలను నిర్వహించడానికి 16 మంది సభ్యులతో సలహా మండలిని ప్రకటించారు. ఇందులో విద్యార్థి ఉద్యమానికి నేతృత్వం వహించిన మహ్మద్ నహీద్ ఇస్లామ్, ఆసిఫ్ మహమ్మద్‌లకు కూడా స్థానం కల్పించారు. ప్రస్తుతం దేశంలో శాంతిని నెలకొల్పి పౌరులకు రక్షణ కల్పించడమే తమ తొలి ప్రాధాన్యమని 84 ఏండ్ల యూనస్ తెలిపారు.
Also Read..
Kangana Ranaut | రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకరం.. జీవితాంతం ప్రతిపక్షంలో ఉండాల్సిందే : కంగన రనౌత్