Balochistan |ఇస్లామాబాద్, మే 12: శాంతి చర్చలు, కాల్పుల విరమణ పేరిట పాకిస్థాన్ ఆడుతున్న నాటకాలకు ఎంతమాత్రం లొంగ వద్దని భారత్‌ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) హెచ్చరించింది. పాకిస్థాన్ దేశం నుంచి వచ్చే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం గురించి ప్రతి చర్చ కేవలం మోసం, యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం మాత్రమేనని ఈ విషయంలో భారత్ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఆక్రమిత బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ మిలిటరీ, ఇంటెలిజెన్స్ స్థావరాలు లక్ష్యంగా 51 ప్రాంతాల్లో 71 సమన్వయ దాడులను చేసినట్టు బీఎల్ఏ ప్రకటించింది.