Balochistan |హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): తూర్పు సరిహద్దు వెంబడి భారత్ చేస్తున్న దాడులతో సతమతం అవుతున్న పాకిస్థాన్‌కు.. పశ్చిమ ప్రాంతంలో బలూచిస్థాన్ వేర్పాటు వాదులు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.
తాజాగా బలూచిస్థాన్ వ్యాప్తంగా 39 ప్రాంతాల్లో పాక్ సైన్యంపై బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) దాడులు చేసింది. కలాట్ జిల్లాలో ఉన్న మాంగోచార్ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నట్టు బీఎల్ఏ శనివారం ప్రకటించింది. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లను, పోలీసులను తమ నిర్బంధంలోకి తీసుకున్నట్టు వెల్లడించింది. హైవేలను నిర్బంధించడం, నిఘా సంస్థల ప్రతినిధులను బంధించడం, మిలిటరీ కాన్వాయ్‌పై దాడులు వంటివి తమ పనేనని ప్రకటించారు.