Pakistan Army | ఇస్లామాబాద్, మే 3: ఒక పక్క భారత్‌తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ పాకిస్థాన్‌కు స్వదేశంలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. తాజాగా, పాకిస్థాన్, బలూచిస్తాన్ మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగాయి. పాకిస్థాన్ ఆర్మీపై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 22 మంది పాక్ సైనికులు, ఆరుగురు లిబరేషన్ ఆర్మీకి చెందిన వారు మృతి చెందారు. పాకిస్థాన్‌లోని కొన్ని పట్టణాలలో లిబరేషన్ ఆర్మీ పాగా వేసినట్టు సమాచారం. కాగా, బలూచిస్థాన్ పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్. అయితే జనాభాపరంగా అతి తక్కువ మంది ఉన్న ప్రావిన్స్. ఇక్కడ ఎడారి ప్రాంతం ఎక్కువ.
అక్కడి ప్రజలు బలూచ్ జాతీయులు.
పాక్ యువతిని పెండ్లాడిన జవాన్ డిస్మిస్
శ్రీనగర్ : పాకిస్థాన్ యువతి మినాల్ ఖాన్‌ను పెండ్లి చేసుకున్న జవాన్ మునీర్ అహ్మద్‌ను డిస్మిస్ చేసినట్లు సీఆర్పీఎఫ్ శనివారం ప్రకటించింది. 41వ బెటాలియన్‌లో పని చేస్తున్న మునీర్ తాను పాక్ జాతీయురాలిని పెండ్లి చేసుకున్న విషయాన్ని రహస్యంగా ఉంచడంతోపాటు, ఆమె వీసా గడువు ముగిసినప్పటికీ, ఆ విషయం తెలిసి కూడా ఆమెకు చట్టవిరుద్ధంగా భారత దేశంలో ఆశ్రయం ఇచ్చాడని తెలిపింది. ఆయన సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించారని, జాతీయ భద్రతకు హానికరమని పేర్కొంది. పాక్‌లోని మినాల్‌ను కశ్మీరులోని మునీర్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా 2024 మే నెలలో పెండ్లి చేసుకున్నట్లు తెలుస్తున్నది.