Anthony Albanese | సిడ్నీ, మే 3: ఆస్ట్రేలియా సాధారణ ఎన్నికలలో శనివారం వామపక్ష సానుకూలవాదిగా పేరు పొందిన ప్రధాని ఆంథనీ అల్బనీస్ గెలుపొందారు. ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులు నెలకొన్న వేళ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన ప్రకటించారు.
ప్రపంచంలోనే ఉత్తమ దేశమైన ఆస్ట్రేలియాకు సేవ చేసేందుకు మరోసారి అవకాశం ఇచ్చినందుకు లేబర్ పార్టీ నాయకుడైన అల్బనీస్ దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నప్పటికీ ప్రాథమిక ఫలితాల సరళి లేబర్ పార్టీకే అధికారం దక్కే అవకాశాలను సూచిస్తోంది.