న్యూఢిల్లీ : విద్యా సంస్థల్లో 2026వ సంవత్సరంలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై పరిమితిని ఆస్ట్రేలియా సడలించింది. 2025వ సంవత్సరంలో 2,70,000 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. ఈ పరిమితిని సడలించి, అదనంగా 9 శాతం మంది విద్యార్థులను చేర్చుకోవాలని నిర్ణయించింది. అంటే, 2026లో 2,95,000 మంది విదేశీ విద్యార్థులకు ప్రవేశం కల్పించవచ్చు.
ఆస్ట్రేలియా ప్రభుత్వం వలస విధానాన్ని సవరించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖ మంత్రి జేసన్ క్లేర్ చెప్పిన వివరాల ప్రకారం, ఇళ్లు, మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడిని పరిష్కరిస్తూనే, విద్యా రంగాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.