ఢాకా : నిరుడు తమ దేశంలో హిందూ, బౌద్ధ, క్రైస్తవ మైనారిటీలపై జరిగిన దాడులు చాలావరకు రాజకీయ పరమైనవేనని బంగ్లాదేశ్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కొన్ని మాత్రం మత పరమైనవని అంగీకరించింది. ఈ దాడులపై నమోదైన కేసుల్లో 35 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపింది. తమపై గత ఏడాదిలో 2,010 మతపరమైన దాడులు జరిగాయని బంగ్లాదేశ్‌లోని హిందూ, బుద్ధిస్ట్, క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ ఇటీవల ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఫిర్యాదుల కోసం పోలీసులు వాట్సాప్ నంబరును అందుబాటులోకి తెచ్చారని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం తెలిపింది.