షిల్లాంగ్: మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని ఒక అక్రమ బొగ్గు గనిలో గురువారం పేలుడు సంభవించి కనీసం 18 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు.
డీజీపీ నాన్గ్రాంగ్ కథనం ప్రకారం థాంస్కూ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పేలుడు జరగడానికి గల కారణాలు తెలియలేదు. అక్రమ తవ్వకాలు జరుగుతున్నప్పుడే పేలుడు సంభవించి ఉండొచ్చని భావిస్తున్నారు.