కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడో రోజుకు చేరింది. రష్యా సైనిక దళాలు దాదాపుగా రాజధాని కీవ్‌ను సమీపించాయి. దీంతో ఉక్రెయిన్ ఆర్మీ ధీటుగా ప్రతిఘటిస్తున్నది. మరోవైపు ఉక్రెయిన్ పౌరులు కూడా తమ వంతు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తున్నారు. శత్రు సైనికులపై దాడికి కొందరు తుపాకులు, ఆయుధాలు చేతపట్టారు. కాగా, ఒక వ్యక్తి ఒంటరిగా ఎలాంటి ఆయుధాలు లేకుండా రష్యా ట్యాంకులను నిలువరించేందుకు ప్రయత్నించాడు. కీవ్ వైపు వెళ్లకుండా అడ్డుకునేందుకు వాటి ముందుకు వచ్చి ధైర్యంగా నిల్చున్నాడు. అయితే రష్యా ట్యాంకులు అతడి నుంచి పక్కకు తొలగి ముందుకు దూసుకెళ్లాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు రష్యా దళాలు కీవ్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో ఒక బహుళ అంతస్తు భవనం ధ్వంసమైంది. సుమారు 200 మంది ఉక్రెయిన్ పౌరులు మరణించినట్లు ఆ దేశం తెలిపింది. కాగా, తనను సురక్షిత ప్రాంతానికి తరలిస్తామన్న అమెరికా ఆఫర్‌ను ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తిరస్కరించారు. యుద్ధం రాజధాని వీధులకు చేరినందున తమకు ఆయుధాలు, సహాయం కావాలన్నారు. రష్యా దళాలు కీవ్ నగరంలోకి దూసుకొస్తున్న నేపథ్యంలో ఈ రాత్రి తమకు కాళరాత్రి అని ఆవేదన వ్యక్తం చేశారు.
✊🏻Українець кидається під ворожу техніку, щоб окупанти не проїхали pic.twitter.com/cZ29kknqhB
— НВ (@tweetsNV) February 25, 2022