Artificial Intelligence | బీజింగ్: నాలుక రంగును చూసి రియల్ టైమ్‌లో 98 శాతం కచ్చితత్వంతో వ్యాధులను గుర్తించే కృత్రిమ మేధ(ఏఐ) కంప్యూటర్ అల్గారిథమ్‌ను సృష్టించినట్టు ఇరాక్, ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు. అసోసియేట్ ప్రొఫెసర్ అలీ అల్-నజీ అధ్యయనం ప్రకారం మధుమేహ రోగుల నాలుక పసుపు రంగులో, క్యాన్సర్ రోగుల నాలుక తరచూ మందమైన పూతతో ఊదా రంగులో, బ్రెయిన్ స్ట్రోక్ రోగుల్లో ఎరుపు రంగులో ఉంటుంది.
నాలుక చిత్రాల ద్వారా రోగమేదో కనిపెట్టడానికి చైనా సంప్రదాయ వైద్యం తనకు స్ఫూర్తిని ఇచ్చిందని నజీ తెలిపారు. 5,200 చిత్రాలను ఉపయోగించి నాలుక రంగును బట్టి వ్యాధిని నిర్ధారించడంలో ఈ ఏఐ నమూనాకు శిక్షణ ఇచ్చారు. చిత్రాలను బట్టి వ్యాధి ఏమిటో ఏఐ సరిగ్గా అంచనా వేసింది.
అమెరికాలో మళ్లీ కరోనా కలవరం!
వాషింగ్టన్: కొవిడ్ కొత్త వేరియెంట్ ‘కేపీ.2’ అమెరికాను వణికిస్తున్నది. దవాఖానల్లో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతున్నది. ప్రతి 10 లక్షల మందికి ఒకటి నుంచి నాలుగుకు పెరిగింది. 2022 జూలై తర్వాత, మురుగునీటిలో వైరల్ యాక్టివిటీ (ఆగస్టు 10న 8.82) అత్యధిక స్థాయికి చేరుకుంది. వేసవి సీజన్లో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని సీడీసీ గణాంకాలు చెబుతున్నాయి. ‘
శాంపిల్స్‌లో 100% ‘సార్స్-కోవ్-2’ను గుర్తించాం’ అని వేస్ట్‌వాటర్ స్కాన్’ ప్రోగామ్ డైరెక్టర్ మార్లినె అన్నారు. స్కూళ్ల సెలవులు ముగిసాక, కేసుల సంఖ్య పెరిగే అవకాశముందని వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎఫ్‌డీఏ అనుమతులు వస్తే, కేపీ.2 వేరియెంట్‌కు కొత్త వ్యాక్సిన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో అందుబాటులో వస్తుందని తెలిసింది.