Nepal |ప్రభుత్వ వ్యతిరేక నిరసనలతో హిమాలయ దేశం నేపాల్ (Nepal) రగులుతున్నది. సామాజిక మాధ్యమాలపై నిషేధం విధించారన్న ఆగ్రహంతో జన్-జడ్ నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ఆ దేశ పార్లమెంట్, అధ్యక్షుడు, ప్రధాని ప్రైవేట్ నివాసాలతో పాటు సుప్రీం కోర్టుకు సైతం నిప్పెట్టారు. ప్రజలు చేపట్టిన ఆందోళనలు హింసాత్మక ఘటనలకు దారితీస్తున్నాయి. ప్రజాగ్రహానికి జడిసి నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. వివిధ శాఖల మంత్రులు కూడా వైదొలిగారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అల్లర్లను నియంత్రించడానికి సైన్యం రంగంలోకి దిగింది.
దేశవ్యాప్తంగా కర్ఫ్యూ (curfew) విధించినట్లు ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దేల్ (General Ashok Raj Sigdel) తాజాగా ప్రకటించారు. ఎవరైనా విధ్వంసానికి పాల్పడినా, దాడులు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించి శాంతిని నెలకొల్పేందుకు చర్చలకు రావాలని నిరసనకారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నిన్న రాత్రి దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ నిరసనల్లో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Also Read..
మంటల్లో హిమాలయ దేశం.. నేపాల్లోఉధృతమైన జనరేషన్ జెడ్ ఆందోళనలు
Nepal PM | నేపాల్ తదుపరి ప్రధాని ఎవరు?.. రేసులో యువ నేతలు